A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆంద్రజ్యోతి కూడా అంగీకరించింది
Share |
March 1 2021, 5:29 am

కుప్పం నియోజకవర్గంలో వైసిపి గెలిచిన తీరుపై ఆంద్రజ్యోతి ఒక కదనం ఇచ్చింది. అందులో ఒక కీలక మంత్రి వ్యూహం అమలు చేశారని పేర్కొన్నారు.ఆ ఆరోపణల సంగతి ఎలా ఉన్నా, ఆ కధనంలో ఒక బాగం ఆసక్తికరంగా ఉంది. అది ఇలా ఉంది....

పని చేసిన ‘సంక్షేమం’
వైసీపీ సర్కారు అమలు చేస్తున్న ‘సంక్షేమం’ కుప్పంలో రెండు రకాలుగా పని చేసింది. ఒకటి... పథకాలపట్ల సంతృప్తితో ఓటు వేయడం! రెండు... టీడీపీపై అభిమానం ఉన్నప్పటికీ, వైసీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు కట్‌ చేస్తారని ఆందోళన చెందడం! మరోవైపు అధికార పార్టీ మద్దతుదారులకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాల్లో కోత విధిస్తారన్న ప్రచారం బాగా పని చేసింది. ఇప్పటికే ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ జరిగినా... తమ అభ్యర్థికి ఓటేస్తేనే ఇల్లు ఇస్తామని, లేదంటే ఆశను వదులుకోవాల్సిందేనని గ్రామాల్లో చాపకింద నీరులా ప్రచారం చేశారు.

టీడీపీ స్వయంకృతం
పంచాయతీ ఎన్నికల్లో ఇంతటి ఘోర పరాజయానికి స్వయంకృతాపరాఽధమే కారణమని టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు వాపోతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఎదిగిన నాయకులెవరూ పంచాయతీ ఎన్నికల బరిలో నిలవలేదు. ‘కొత్త వారికి అవకాశం’ అనే సాకు చూపుతూ దూరంగానే ఉండిపోయారు. పోనీ.. ఎన్నికల్లో నిలిచిన వారికి అండగా ఉన్నారా అంటే అదీ లేదు. ఖర్చు సంగతి పక్కనపెడితే... కనీసం అభ్యర్థి వెన్నంటి ఉండి ధైర్యమూ చెప్పలేదు. సీనియర్‌ నాయకులందరూ ఏవేవో కారణాలు చూపించి పక్కకు తప్పుకోవడంతో చాలాచోట్ల ఆర్థికంగా బలహీనులు, గ్రామాల్లో పెద్దగా బలంలేని వారినే పోటీకి నిలపాల్సి వచ్చింది. ఇక... పోలింగ్‌ రోజున బూత్‌ల వద్ద అభ్యర్థులు తప్ప, ఆయా ప్రాంతాల్లోని టీడీపీ సీనియర్‌ నాయకులు కానీ, అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించినవారుకానీ కనిపించలేదు. అక్కడక్కడా ఒకరిద్దరు మెరుపులా మెరిసి మాయమయ్యారు. ‘అధికార పార్టీ డబ్బులు పంచుతోంది’ అని శోకాలు తీసేవారు తప్ప... తమ అభ్యర్థులకు ఆర్థికంగా-నైతికంగా అండగా నిలిచేవారు కనిపించలేదు. దీంతో టీడీపీ అభ్యర్థులు పోలింగ్‌ బూత్‌లవద్ద నిస్సహాయంగా మిగిలిపోయారు.

పోరాట పటిమ ఏదీ?
ఏదిఏమైనా కుప్పం పంచాయతీల్లో గెలుపు జెండా ఎగరేసి.. చంద్రబాబు లక్ష్యంగా విరుచుకుపడాలనేది వైసీపీ వ్యూహం! దీనిపై అప్రమత్తమై దీటైన వ్యూహాలు రచించే వారే కరువయ్యారు. చంద్రబాబు అమరావతి కేంద్రంగా రాష్ట్రవ్యాప్త ఎన్నికలను పర్యవేక్షిస్తుండగా... ఆయన సొంత నియోజకవర్గం కుప్పం నేతల్లో గెలిచి తీరాలన్న పోరాట పటిమ ఏమాత్రం కనిపించలేదు. క్షేత్రస్థాయిలో ఎన్ని లొసుగులు ఉన్నప్పటికీ... ‘పార్టీ బలంగా ఉంది. మన వాళ్లే గెలుస్తారు’ అంటూ చంద్రబాబును మభ్యపెట్టినట్లు కార్యకర్తలు చెబుతున్నారు. ఇప్పటికైనా అధినేత క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకుని... బలమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అని ఆ పత్రిక కదనాన్ని ఇచ్చింది.
................

కుప్పంలో పనిచేసిన సంక్షేమం రాష్ట్రం అంతటా పనిచేసిందని ఎందుకు అనుకోరో తెలియదు.

tags : kuppam

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info