నలభై శాతం పైగా పంచాయతీలు గెలిచామని చెబుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషనర్ స్పూర్తిని ప్రదర్శించలేకపోతోందని వ్యాఖ్యానించడం విశేషం.
ఎన్నికలు స్వేచ్ఛగా జరపాలని ఆదేశిస్తూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలను ఎన్నికల కమిషన్కు ఇచ్చిందనీ, అయినా ఆ స్ఫూర్తిని కమిషన్ ప్రదర్శించలేకపోతోందనీ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని మీడియా కధనం. ‘తన ఆదేశాలను కిందిస్థాయిలో అధికారులు పాటించకపోయినా ఎన్నికల కమిషన్ ఏమీ చేయలేకపోతోంది. ఇది అధికార పార్టీకి మరింత వెసులుబాటు ఇచ్చింది. ఓట్ల లెక్కింపులో అక్రమాలు అరికట్టాలని టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. వైసీపీ నేతలకు ఈ అక్రమాలు తాత్కాలిక ఆనందాన్ని కలిగించవచ్చని, కానీ తర్వాత వాటిని వడ్డీతో సహా తీరుస్తాం’ అని చంద్రబాబు అన్నారు. tags : chandrababu