A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు రెండు పాయింట్లు-ఏది నమ్మాలి
Share |
March 1 2021, 5:37 am

పంచాయతీ ఎన్నికలను ఒక ఫార్సుగా మార్చారనీ, బెదిరింపులు... దౌర్జన్యాలతో రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారనీ ఒకవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపిస్తూ, మరో వైపు నలభై శాతం పంచాయతీలను గెలిచామని ఆయన చెబుతున్నారు. ‘వలంటీర్లు ప్రతి ఓటర్‌ వద్దకు వెళ్లి అమ్మ ఒడి, పింఛను, రేషన్‌ కార్డులు తీసివేస్తామని రౌడీల మాదిరిగా బెదిరించి వైసీపీకి ఓట్లు వేయించారని ఆయన విమర్శించారు. విపరీతంగా డబ్బు సంపాదించి ఆ డబ్బును వైసీపీ నేతలు ఈ ఎన్నికల్లో వెదజల్లారు. ఓటుకు రూ.పది వేలు కూడా ఖర్చు చేశారు. అయినా టీడీపీ అభ్యర్థులు గెలిస్తే ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవడం మొదలు పెట్టారు. మొదటి విడతలో టీడీపీకి 38 శాతం... రెండో విడతలో 40 శాతం... మూడో విడతలో 42 శాతం పంచాయతీలు ఇచ్చారు. నాలుగో విడతలో కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాం’’ అని చంద్రబాబు కోరారని మీడియా కధనం.

చంద్రబాబు చెప్పే రెండు పాయింట్లలో ఏది నమ్మాలి?

tags : babu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info