ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మొత్తం మీద కుప్పంలో ఓడినట్లు అంగీకరించారు. ఆయన ఏ ఆరోపణలు చేసినా ,అసలు విషయాన్ని అంగీకరించారనుకోవాలి.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోలేదని... ప్రజాస్వామ్యమే ఓడిందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘నా నియోజకవర్గానికి కోట్ల రూపాయలు పంపి వెదజల్లారు. బయటి వ్యక్తులు వందల మంది వచ్చి అక్కడ కూర్చున్నారు. దీనిపై పోలీసులకు సాక్ష్యాలతోసహా ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. కుప్పం ప్రజలు శాంతికాముకులు. నేను ఆ నియోజకవర్గానికి 35 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అక్కడి వారంతా నాకు కుటుంబ సభ్యుల వంటివారు. అటువంటి శాంతియుత ప్రాంతాన్ని కూడా వైసీపీ నేతలు కలుషితం చేస్తున్నారు. అక్కడి పంచాయతీల్లో టీడీపీ ఓడిపోయింది కాబట్టి నేను రాజీనామా చేయాలని ప్రకటనలు ఇస్తున్నారు. నేను కూడా అడ్డు తొలిగితే ఇక రాష్ట్రంపై పడి అడ్డగోలుగా దోచుకోవాలన్నది వారి కోరిక. కుప్పంలో గెలుపు సాధించి టీడీపీ పని అయిపోయిందని ప్రచారం చేసి మైండ్ గేమ్ ఆడాలని అనుకొంటున్నారు. ఇటువంటి వ్యవహారాలతో టీడీపీ పోరాట స్ఫూర్తిని చంపలేరు. మేం రాష్ట్రం కోసం పోరాడుతున్నాం. ప్రజలు మా పోరాటాన్ని అర్థం చేసుకొన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో ఇంకా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం’’ అని ధీమా వ్యక్తం చేశారని ఆంద్రజ్యోతి మీడియాలో కదనం వచ్చింది. ఈ వార్త చదివితే సారాంశం ఏమిటంటే మిగిలిన చోట్ల గెలిచారని ప్రజలు అనుకోవాలని, కుప్పంలో మాత్రం అక్రమాల వల్ల ఓడిపోయామని చెప్పాలన్నది ఆయన తాపత్రయంగా కనిపిస్తుంది. tags : kuppam