A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శాసనమండలిలో పెరగనున్న వైసిపి బలం
Share |
April 19 2021, 4:52 pm

ఎపిలో శాసనమండలిలో మరికొన్ని స్థానాలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు రానున్నాయి. వచ్చే నెల పదిహేనో తేదీన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఎమ్మెల్యేల కోటాలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఆరు స్థానాలు వైసిపికే రావచ్చు.లేదా ఒక స్థానం ఏమైనా టిడిపికి వెళ్లవచ్చు.కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం
మార్చి 15న ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 25 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 4 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువును ప్రకటించారు. మార్చి 5న నామినేషన్ల పరిశీలన కాగా, మార్చి 8 వరకు ఉపసంహరణ గడువు విధించారు. మార్చి 15న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్‌ జరుగుతుంది.మార్చి 29తో నలుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ రాజీనామాతో ఏర్పడిన స్థానంతో పాటు, చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఏర్పడిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఖాళీ కానున్న తిప్పేస్వామి, సంధ్యారాణి, వీరవెంకటచౌదరి, షేక్‌ అహ్మద్‌ ఇక్బాల్‌ స్థానాలకు మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

tags : mlc elections

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info