A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుపై అంబటి ఘాటు వ్యాఖ్య
Share |
April 19 2021, 5:31 pm

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ముఖ్యమంత్రి జగన్ పై చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు.
చంద్రబాబూ.. నీకు మతి భ్రమించిందా? పట్టపగలే మందు కొట్టావా? విశాఖ వీధుల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఇష్ట మొచ్చినట్టు తిడతావా? ఫ్రస్ట్రేషన్‌తో దిగజారి మాట్లాడతావా?’ అని అంబటి ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కును రక్షించుకునే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేస్తున్న కృషిని ప్రజలు, కార్మిక సంఘాలు అభినందిస్తుంటే.. ఆయన మాత్రం జనాన్ని రెచ్చగొట్టే నీతి మాలిన రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి కనీసం లేఖ రాసే ధైర్యం చేయడం లేదని ఆయన అన్నారు.
మా ఎంపీ విజయసాయిరెడ్డిపై మాట్లాడిన భాష ఏమిటి? ఇదేనా మీ రాజకీయ అనుభవం? పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు చావు దెబ్బ తినడంతో ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు. అని ఆయన అన్నారు.

tags : ambati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info