A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోస్కో కంపెనీ వారు వచ్చారు..జగన్ ఫెయిర్
Share |
April 19 2021, 5:27 pm

పొస్కో కంపెనీనికి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వచ్చే అవకాశాలు ఉండవని ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పోస్కో ప్రతినిధులు తనను కలిశారని, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టమని సూచించినట్లు తెలిపారు. కుదరకపోతే శ్రీకాకుళం జిల్లా భావనపాడు కృష్ణపట్నం పోస్టుల వద్ద ఆ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే పోస్కోకు సహకరిస్తామని కార్మిక నాయకులతో జగన్‌ తెలిపారు. దేవుని ఆశీస్సులతో స్టీల్ ప్లాంట్ విషయంపై కేంద్రం ఆలోచనలో మార్పు వస్తుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏపీలో ఇనుప ఖనిజం నిల్వలు లేవు, ఉన్నవి చాలా లోగ్రేడ్‌ గనులున్నాయని సీఎం జగన్‌ తెలిపారు. ఒడిశాలో ఈ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలని కోరినట్లు చెప్పారు. రుణాలను ఈక్విటీల రూపంలోకి మారిస్తే వడ్డీల భారం తగ్గుతుందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వ సంస్థ, దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు తాము నిజాయతీగా, చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. పోస్కోవాళ్లు రాష్ట్రానికి రావడం వాస్తవం, నన్ను కలవడం వాస్తవమని, కడప, కృష్ణపట్నం, భావనపాడు చోట్ల ఫ్యాక్టరీ పెట్టమని వారిని కోరినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info