A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంచు భీబత్సం-అల్లాడుతున్న అమెరికా
Share |
April 19 2021, 6:11 pm

అమెరికాలోని పలు రాష్ట్రాలను మంచు తుపాను వణికిస్తోంది. దక్షిణాదిలో ఉన్న పదిహేను కోట్ల మంది మంచు బారిన పడి అల్లాడుతున్నారు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి వీల్లేకుండా రహదారులన్నీ మంచుతో కప్పేసి ఉన్నాయి. టెక్సాస్‌ చుట్టుపక్కల రాష్ట్రాల్లో 40 లక్షల మందికిపైగా అమెరికన్లు నీళ్లు, కరెంట్‌ లేక అల్లాడిపోతున్నారు. టెక్సాస్, అలబామా, ఒరెగాన్, ఒక్లహోమా, కాన్సస్, కెంటకీ, మిసిసిపీ రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. టెక్సాస్‌లో పరిస్థితి మరీ ఘోరంగా మారిపోయింది. విద్యుత్‌ ప్లాంట్లు సరిగా పని చేయడం లేదు. పైపుల్లో నీరు గడ్డ కట్టుకపోవడంతో ప్రజలు నీళ్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ 27 లక్షల మందికిపైగా ప్రజలు చీకట్లోనే మగ్గిపోతున్నారు. ఆర్కిటిక్‌ నుంచి వీస్తున్న బలమైన చలిగాలుల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. మరో వైపు నార్త్ కరోలినా లో టొర్నాడుల కారణంగా ముగ్గురు మరణించారు.

tags : america, snow

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info