సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విశాఖపట్నం లో పర్యటిస్తారు. . ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు వెళతారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 11.10 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతినిధి బృందం సీఎం వైఎస్ జగన్ను కలవనుంది. ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని వినతి పత్రం సమర్పించనుంది.11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య పెందుర్తి మండలం చినముషిడివాడలో విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవం తొలి రోజు కార్యక్రమంలో పాల్గొంటారు.ముఖ్యమంత్రి జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై కార్మిక సంఘాల వారికి భరోసా ఇవ్వవవలసి ఉంటుంది. tags : vizag cm meet