A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
20 నెలల్లోనే జగన్ కు పెద్ద అవార్డు
Share |
April 19 2021, 6:25 pm

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సి.ఎమ్. ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం విశేషం. ఆయన అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల్లోనే ఈ అవార్డుకు ఎంపికయ్యారు.స్కోచ్ గ్రూప్ ప్రతి సంవత్సరం పలు శాఖలకు, ముఖ్యమంత్రులకు ఈ అవార్డులు ప్రదానం చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలనలో విప్లవాత్మక మార్పులతో పారదర్శకతకు పెద్దపీట వేసిందని స్కోచ్‌ గ్రూప్‌ దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో చేపట్టిన 123 ప్రాజెక్టులపై ఏడాది పొడవునా జరిగిన అధ్యయనంలో పాలనలో ఉత్తమ ప్రతిభ కనపరిచినట్లు తేలిందని స్కోచ్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌ తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి ‘సీఎం ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును అందజేశారు.
ముందుగానే ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే రైతుల నుంచి పంటలు కొనుగోలు చేయడం ఆసక్తికర నమూనాగా నిలిచిందని సమీర్ చెప్పారు. దీనివల్ల రైతులకు భారీ ప్రయోజనం కలగడంతో పాటు మంచి ఫలితాలు వచ్చాయన్నారు.వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా మహిళల ఆర్ధిక సాధికారతకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని చెప్పారు. దిశ, అభయ పథకాల ద్వారా మహిళల భద్రత, రక్షణకు చర్యలు తీసుకున్నారని, తద్వారా శాంతి భద్రతలు వెల్లివిరియడంతోపాటు మహిళల్లో భరోసా పెరిగి గణనీయమైన మార్పులు తెచ్చిందని తెలిపారు. కరోనా నియంత్రణలో కూడా ప్రభుత్వం సమర్దంగా వ్యవహరించిందని ఆయన చెప్పారు.

tags : jagan, award

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info