జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలకను తగ్గించడానికి బిజెపి ప్రయత్నించినట్లుగా ఉంది. పవన్ కళ్యాణ్ తో బిజెపి ఎపి అద్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మద్య తిరుపతి ఉప ఎన్నిక, ఇతర రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం బిజెపి రాష్ట్ర నాయకత్వం తమను చిన్నచూపు చూస్తోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఈ నేపద్యంలో పవన్ కళ్యాణ్ ను బుజ్జగించడానికి వీర్రాజు వెళ్లారని భావిస్తున్నారు. కాగా రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో అదికారంలోకి రావడానికి కృషి చేస్తాయని వీర్రాజు అన్నారు. అయితే తిరుపతి ఉప ఎన్నికలో ఎవరు పోటీచేసేది ఇంకా క్లారిటీ వచ్చినట్లు లేదు. తిరుపతి ఉప ఎన్నిక ద్వారా తమ కూటమి అదికారంలోకి రావడానికి పునాది వేసుకోవచ్చని భావిస్తున్నామని వారు అంటున్నారు. tags : pawankalyan