సచివాలయ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డిజిపికి పిర్యాదు చేసిన నేపద్యంలో వెంకట్రామిరెడ్డి వివరణ ఇచ్చారు. తాను నిమ్మగడ్డను బెదిరించలేదని ఆయన స్పష్టం చేశారు. కమిషనర్ ను బెదిరించవలసిన అవసరం తనకు లేదని అన్నారు.కరోనాతో ఉద్యోగులకు ప్రాణ భయం ఉందని చెప్పామని, ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను నిమ్మగడ్డకు తనకు ఆపాదింంచుకోవడం సరికాదని, తాను ఆయనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. నిమ్మగడ్డ కోరినట్లు నాపై పోలీసులు నిఘా పెట్టినా అభ్యంతరం లేదు. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం మంచిది కాదని చెప్పాం. 2 నెలల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే వచ్చే నష్టమేంటి?. ఉద్యోగుల కోసం ఎన్నికలు వాయిదా వేయలేరా?. అని ఆయన ప్రశ్నించారు. tags : nimmagadda