నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అహంకారంతోనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారన్నది రాష్ట్రప్రభుత్వ అభిప్రాయమని సత్తెనపల్లి వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబుకు ఓటెయ్యని ప్రజలపై కక్ష తీర్చుకోవడమే ఆయన లక్ష్యంగా కన్పిస్తోందన్నారు. నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ఆయన పెట్టిన ప్రెస్‌మీట్ రాజకీయపార్టీ సమావేశంలా ఉందన్నారు. వ్యాక్సినేషన్ జరిగేప్పుడు ఎన్నికలు పెట్టడం ఎలా సాధ్యమన్నారు. ఆయనో రాజకీయపార్టీ వ్యక్తిలా వ్యవహరిస్తున్నారని, నోటిఫికేషన్ విడుదలకోసం ఆయన పెట్టిన ప్రెస్‌మీట్ పార్టీ సమావేశంలా ఉందని మండిపడ్డారు. మూడు నెలల్లో పదవీకాలం ముగుస్తుందని, ఈలోగా ఎన్నికలు పెట్టాలన్న ఆరాటమే కనిపించిందని దుయ్యబట్టారు. 2018లోనే పెట్టాల్సిన ఎన్నికలను ఎందుకు పట్టించుకోలేదు? అప్పుడీ న్యాయపోరాటం ఏమైందని ప్రశ్నించారు. 2019లో ఎన్నికలున్నాయని, చంద్రబాబుకు నష్టం జరుగుతుందని వాయిదా వేయడం వాస్తవం కాదా? అని నిలదీశారు. కరోనా భయంతో... ప్రజలకు దూరంగా హైదరాబాద్ ఇల్లు దాటని చంద్రబాబు, లోకేష్‌లు కూడా పంచాయతీ ఎన్నికలు పెట్టాలనడంలో అర్థమేంటి? తనకు ఓటు వేయని ప్రజలు కరోనాతో ప్రాణాలు కోల్పోవాలని కోరుకోవడం దారుణమని అన్నారు. tags : ambati