A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపికి డిపాజిట్ దక్కరాదు-సిపిఐ
Share |
March 7 2021, 10:50 am

తిరుపతి ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ దక్కకుండా ఓడించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. అన్నదాతల నడ్డి విరిచి కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులై బీజేపీని ఓడించాలని కోరారు. నాడు బీజేపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని, విభజన సమయంలో పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని మాట్లాడిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.. నేడు అదే బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు. లౌకిక భావాలున్న పవన్‌ మతోన్మాద పార్టీ అయిన బీజేపీ నుంచి తక్షణం వైదొలగి, రైతాంగ ఉద్యమానికి మద్దతుగా నిలవాలన్నారు.

tags : ramakrishna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info