కారణం ఏమైనా ఈ ఒక్క పాయింట్ వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరెక్టు మాటే అన్నారు. ఆయన ఒంగోలులో మాట్లాడుతూ తాము వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్రిస్టియన్గా చూడమని ఒక ముఖ్యమంత్రిగా, ఒక నాయకుడిగానే చూస్తామని, కొంతమంది నాయకులు ముఖ్యమంత్రిని ఉద్దేశించి క్రిస్టియన్ ముఖ్యమంత్రి అంటూ విమర్శించడం సరికాదని ఆయన అన్నారు. కులమతాలకతీతంగా రాజకీయాలు ఉండాలని జనసేన భావిస్తోందన్నారు.
సీఎం పలానా మతం, ఇంకొకరు మరొక మతం అంటూ మతాల గురించి తాను మాట్లాడనన్నారు. మరో సందర్భంలో హిందూమతంపై దాడి జరుగుతోందని, ఇతరత్రా ఆరోపణలు టిడిపి మాదిరిగానే చేసినా, ఈ ఒక్క పాయింట్ మాత్రం సరిగానే చెప్పారు. tags : pawankalyan