ఎపి ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఆదిత్యనాద్ దాస్ రాసిన లేఖను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిగణనలోకి తీసుకుంటారా?లేదా అన్న ఉత్కంఠ ఏర్పడింది. అయితే ఎక్కువ శాతం దానితో నిమిత్తం లేకుండానే నిమ్మగడ్డ ముందుకు వెళ్లవచ్చని భావిస్తున్నారు. తాము ఎన్నికలకు వ్యతిరేకం కాదని , అయితే కరోనా వాక్సిన్ టీకాలను ప్రంట్ లైన్ వారియర్స్ కు వేస్తున్నామని, అందువల్ల కొన్నాళ్ల పాటు ఎన్నికలు వాయిదా వేయాలని దాస్ కోరారు.‘‘కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సిన్ రెండు డోసులివ్వాలి. మొదటి, రెండో డోసులకు మధ్య నాలుగు వారాల వ్యవధి అవసరం. రెండో డోసులూ తీసుకున్న నాలుగు వారాల తర్వాతే వారిలో పూర్తిస్థాయి యాంటీ బాడీస్ వృద్ధి చెందుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఆ విధుల్లో కూడా ఈ ఫ్రంట్లైన్ వారియర్సే కీలకమవుతారు. మరి వారికి టీకా ఇవ్వటం ఎలా? ఇవ్వకపోతే కేంద్ర మార్గదర్శకాలను పాటించనట్లే. పైపెచ్చు వారి ఆరోగ్యాన్ని, ప్రాణాలను ఫణంగా పెడుతున్నట్టే’’ అని ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేంద్ర నిబంధనలను ఉల్లంఘించినట్లే’ అని లేఖలో స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్పెల్పీ) దాఖలు చేసిందని, ఇది సోమవారం విచారణకు రానున్నదని సీఎస్ తన లేఖలో తెలియజేశారు.
ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేయడం సాధ్యం కాదు. ఎన్డీఎంఏ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మొదటి డోస్ వ్యాక్సిన్ ఇచ్చిన 60 రోజుల తర్వాతే ఆ వ్యక్తిలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. ఈ ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ వ్యాక్సినేషన్, ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి వీలుగా కొత్త షెడ్యూలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికలు, పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖ అధికారులు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అని ఆయన వివరించారు. tags : adityanadh das