ఎపిలో పంచాయతీ ఎన్నికల విధులలో పాల్గొనలేమని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయా సంఘాల వారు ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఆదిత్యనాద్ దాస్ ను కలిసి వినతిపత్రాలు అందచేశారు. తదుపరి ఉద్యోగ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్టాడుతూ ఎన్నికల కమిషనర్ ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని, దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగులకు ప్రమాదం వచ్చేలా ఎన్నికలు జరపడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఉద్యోగులకు కరోనా వాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు పెట్టుకోవచ్చని ఆయన అన్నారు. ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఈ విషయమై సంప్రదించుకుని నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. పోలీసు అదికారుల సంఘం అద్యక్షుడు జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరామని చెప్పారు. టీచర్ల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలపై ఎన్నికల కమిషన్ , రాష్ట్ర ప్రభుత్వం ఒకరికొకరు పంతానికి పోతున్నారని, మద్యలో ఉద్యోగులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గౌరవ న్యాయస్థానం కూడా ఎన్నికల కమిషనర్, ప్రభుత్వ వాదనాలు విన్నారు కాని , ఉద్యోగుల బాధలను వినలేదని ఆయన అన్నారు. కరోనా పెద్ద సంక్షోభంగా ఉన్న విషయం అందరికి తెలుసునని ఆయన అన్నారు. స్థానిక ఎన్నికలకు అంత ప్రాధాన్యత లేదని, గతంలో ఎన్నడూ ఐదేళ్లకు ఒకసారి నిర్వహించిన సందర్బాలు తక్కువని, ఇప్పుడు ఎన్నికలకు అత్యవసర పరిస్థితి లేదని, అయినా ఎన్నికల కమిషనర్ పంతంతో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.కరోనా పాజిటివ్ వస్తే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటి అని ఆయన అన్నారు.కాగా పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లు ఎన్నికల కమిషనర్ తో సమావేశానికి గైర్ హాజరయ్యారు. tags : election, employees