A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా?లేదా
Share |
March 7 2021, 12:05 pm

సుప్రింకోర్టు ఎపిలో పంచాయతీ ఎన్నికలపై స్టే ఇస్తుందా?లేదా అన్నది పెద్ద చర్చగా ఉంది. స్టే ఇస్తే పర్వాలేదు. లేకుంటే శనివారం నుంచి నామినేషన్ల పర్వం మొదలు కావల్సి ఉంటుంది.దానికి ఉద్యోగులు సహకరిస్తారా?లేదా సహకరించకపోతే ఏమి అవుతుంది? సుమారు ఏడు లక్షల మంది కోవిడ్ వాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. పైగా ఉద్యోగ సంఘాలు తమ ప్రాణాలకు విలువలేదా అని ప్రశ్నిస్తున్నాయి.
కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వైద్యులు, పోలీసులు ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాలు పంచుకుంటున్నారు. మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌లుగా తహసిల్దార్లు పర్యవేక్షిస్తున్నారు. గ్రామ పరిధిలో పంచాయతీ ఈవోలు, పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్‌లు టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్ల పర్యవేక్షణ అంతా వ్యాక్సినేషన్‌పైనే ఉంది. ఒక కేంద్రంలో ఒకరోజు వ్యాక్సిన్‌ వేస్తే దాన్ని ఒక సెషన్‌ అంటారు. అలా 40 వేలకుపైగా సెషన్స్‌ వేయాల్సి ఉంది. ఒక్కో సెషన్‌కు 10 నుంచి 12 మందికి పైగా సిబ్బంది అవసరమున్నట్టు ఆరోగ్య శాఖ తేల్చింది. వీరంతా ఒకవైపు తమ విధులను నిర్వర్తిస్తూనే అదనంగా ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఉదాహరణకు పోలీస్‌ సిబ్బంది వ్యాక్సినేషన్‌లో నిరంతరం నిమగ్నం కావాల్సి ఉంటుంది. వీరు వ్యాక్సిన్‌ తీసుకోవడంతోపాటు కొద్ది రోజులు వైద్యుల పరిశీలనలో ఉండాలి. అనంతరం టీకా ప్రక్రియను పర్యవేక్షించాలి. ఇలా రకరకాల విధులు నిర్వహించాలి. ఇతర సిబ్బంది విషయం చూసినా వారు టీకా తీసుకోవడంతోపాటు కొద్ది రోజులు పర్యవేక్షణలో ఉండటం అవసరం. అలాంటప్పుడు వారికి పంచాయతీ ఎన్నికల విధులు అప్పగిస్తే ఎలా నిర్వహించగలరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని మీడియాలో కదనం వచ్చింది.

వ్యాక్సిన్‌ నిల్వ కేంద్రాలు, సరఫరాకు సంబంధించి పోలీసులు పటిష్టంగా బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్‌ నుంచి ప్రాంతీయ వ్యాక్సిన్‌ సెంటర్‌కు, అక్కడ నుంచి జిల్లా వ్యాక్సిన్‌ కేంద్రానికి, అక్కడనుంచి పీహెచ్‌సీకి, వ్యాక్సిన్‌ కేంద్రానికి చేరే వరకు రోజూ వేలాదిమంది పోలీసులు బందోబస్తులోనే ఉంటున్నారు. వ్యాక్సిన్‌ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈనెల 17న జరగాల్సిన పోలియో కార్యక్రమాన్ని సైతం కేంద్రం వాయిదా వేయడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల విధులు నిర్వహించాలనడం ప్రాణ సంకటమేనని అధికారులు పేర్కొంటున్నారు. పైగా ఫిబ్రవరి 1 నుంచి రెండో దశ వ్యాక్సిన్‌కు పంచాయితీ, రెవెన్యూ, మున్సిపల్‌ కార్యాలయాలను ఇప్పటికే సిద్ధం చేశారు.అంతేకాక నామినేషన్ల ప్రక్రియకు సంబందించిన ఏర్పాట్లు ఇంతవరకు మొదలు కాలేదు. అలాంటప్పుడు ఎన్నికలు ఎలా జరుగుతాయన్న ఉత్కంఠ ఏర్పడింది.

tags : ap, elections

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info