A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెటిఆర్ కాబోయే సి.ఎమ్.అంటూ...
Share |
March 7 2021, 12:11 pm

టిఆర్ఎస్ లో ఏదో జరుగుతోంది. పలువురు నేతలు ధైర్యంగా మంత్రి కెటిఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేస్తున్నారంటే , ముఖ్యమంత్రి కెసిఆర్ సమ్మతితో కాని, ఆయన పరోక్ష సంకేతాల ద్వారా కాని జరుగుతుండవచ్చు. లేకుంటే కెసిఆర్ కు ఆగ్రహం వచ్చే అవకాశం ఉంటుంది. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారం సాగుతున్నా,పార్టీపరంగా ఎలాంటి ప్రకటన రాకపోవడం కూడా గమనార్హమే.ఉప సభాపతి పద్మారావు ఒక సభలో ఏకంగా కెటిఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ అభినందనలు కూడా చేప్పేశారు.అయితే పద్మారావు ‘కాబోయే సీఎంకు కంగ్రాట్స్‌’అంటూ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్పందించలేదు. కాకపోతే చిరునవ్వుతో కనిపించారు.అలాగే మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, ఈటెల రాజేందర్,గంగుల కమలాకర్ ,కొందరు ఎమ్మెల్యేలు సైతం కెటిఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ గాత్రం అందుకున్నారు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనేదానిపై భిన్న కదనాలు వస్తున్నాయి.కెసిఆర్ పుట్టిన రోజు తర్వాత ఈ పరిణామం జరగవచ్చని ,కొందరు ఉగాది తర్వాత అని మరికొందరు,ఇలా రకరకాల జోస్యాలు చెబుతున్నారు.

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info