తిరుపతి ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలన్నదానిపై భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. పైకి ఆ విషయం ప్రకటించకపోయినా, ఈ రెండు పార్టీలు ఎవరికి వారు తామే పోటీచేయాలని భావిస్తున్నారని అంటున్నారు.జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. తిరుపతిలో బిజెపికి పోటీచేసే అవకాశం ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని జనసేన నేతలు అభిప్రాయపడ్డారు.బిజెపికి గెలిచే అవకాశం లేదని కొందరు నేతలు తేల్చారట.కొందరైతే బీజేపీ అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సహకరించబోమని చెప్పారట. దీంతోపాటు తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సహకరించిన నేపథ్యంలో తిరుపతిలో మనమే పోటీ చేద్దామని సలహా ఇచ్చారని కధనం. tags : janasena