A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖ పాలన రాజధాని సన్నాహాలపై స్టోరీ
Share |
January 24 2021, 8:31 pm

విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజదానిగా ప్రకటించిన నేపద్యంలో ప్రభుత్వం అందుకు సంబంధించిన సన్నాహాలను కామ్ గా చేసేస్తోందంటూ ఆంధ్రజ్యోతి ఒక వార్త ఇచ్చింది. దాని ప్రకారం అదికారులు తమ శాఖల అవసరాల కోసం భవనాలను అన్వేషిస్తున్నారట.ఆ కదనంలోని వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖ నగరంతోపాటు మధురవాడ, కాపులుప్పాడ, ఆనందపురం ప్రాంతాల్లో భవనాలను పరిశీలిస్తున్నారు. భీమిలి బీచ్‌రోడ్డులో గాయత్రి, గీతం విద్యా సంస్థల మధ్య గిరిజన మ్యూజియం కోసం భవన నిర్మాణం పూర్తికావచ్చింది. ఈ భవనంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయం ఏర్పాటుచేయాలని దాదాపు నిర్ణయించారు. ఈ విషయాన్ని విజయవాడలో ఉన్న అధికారులకు సూత్రప్రాయంగా చెప్పినట్టు తెలిసింది. పది రోజుల క్రితం విజయనగరం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తిరుగు ప్రయాణంలో విశాఖ కలెక్టర్‌ను విమానంలో తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా విశాఖలో పాలనా రాజధానికి సంబంధించి భవనాల అన్వేషణ, కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు, ఇతర ఏర్పాట్లపై చర్చించినట్టు తెలిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ లేదా జూన్‌ నుంచి విశాఖ కేంద్రంగా పాలన జరుగుతుందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. నాలుగు నెలల్లో విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటు తథ్యమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం చేసిన ప్రకటన ఇందుకు బలం చేకూరుస్తోంది.కాలుష్య నియంత్రణ మండలి: మండలి ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు స్థలం కోసం చూస్తున్నారు. ప్రస్తుతం మాధవధారలోని జోనల్‌ కార్యాలయం ఉన్నప్పటికీ ప్రధాన కార్యాలయానికి మరోచోట భారీ భవనం నిర్మించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

ఇందుకు విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి ఎకరా స్థలం దీర్ఘకాలిక లీజు విధానంలో తీసుకోనున్నారు. త్వరలో విశాఖ ఉక్కు కర్మాగార యాజమాన్యం నుంచి అనుమతి తీసుకుని భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలిసింది. కృష్ణా బోర్డు: జల వనరుల శాఖ ఉత్తరాంధ్ర సీఈ కార్యాలయ ఆవరణలో కృష్ణా బోర్డు కార్యాలయం ఏర్పాటుచేస్తారని తెలిసింది. ఇదే ప్రాంగణంలో నిర్మిస్తున్న మరో భవనాన్ని జల వనరుల శాఖ ప్రధాన కార్యాలయానికి కేటాయిస్తారని అధికారులు చెబుతున్నారు. కొందరు మంత్రులు భవనాల కోసం అటు అధికారులతోపాటు ఇటు పార్టీ నేతల ద్వారా అన్వేషిస్తున్నారు. అయితే రాజధాని తరలింపుపై కోర్టులో కేసులు ఉన్నందున ఎవరూ బహిరంగంగా ఈ విషయాలను వెల్లడించడం లేదు అని ఆ కదనంలో తెలిపారు.

tags : vizag

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info