A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు పాపాలే శాపాలయ్యాయి
Share |
January 24 2021, 8:51 pm

చంద్రబాబు చేసిన పాపాలే శాపాలై ఆయన్ను ఓడించాయని మాజీ మంత్రి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. 18 నెలలైనా ఎందుకు ఓడిపోయింది చంద్రబాబు తెలుసుకోలేకపోతున్నారని ఆయన ద్వజమెత్తారు. ప్రజలు తననెందుకు ఓడించారో కూడా తెలుసుకోలేని చంద్రబాబు, అక్కసుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై అవాకులు చెవాకులు పేలడం అర్థరహితమని అన్నారు. భోగి మంటల సాక్షిగా అబద్ధాలు చెప్పిన చంద్రబాబుకు సంప్రదాయాలు, దేవుడిపై ఏమాత్రం విశ్వాసం లేదని రూఢీ అయిందన్నారు. ఓటమిని జీర్ణించుకోలేని చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. మొన్నటిదాకా లోకేష్‌... ఇప్పుడు బాలకృష్ణ స్క్రిప్టు రాస్తున్నారా అన్పిస్తోందని ఆయన అన్నారు.

tags : pardhasaradhi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info