A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇంకా చంద్రబాబు ఆలోచించలేదా
Share |
January 24 2021, 9:09 pm

గతంలో అదికారలో ఉన్నప్పుడు ఏనాడూ రైతుల గురించి ఆలోచించని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇప్పుడు అకస్మాత్తుగా రైతులు గుర్తుకు రావటం విడ్డూరంగా ఉందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలు ఎందుకు ఓడించారో ఆలోచించడానికి చంద్రబాబుకు 20 నెలలు పట్టిందని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అంటూ ఐదేళ్లపాటు ప్రజల్ని మోసగించారని, చంద్రబాబు ఇచ్చిన 650 బూటకపు హామీలను నమ్మి మోసపోయిన ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. సీఎం జగన్‌పై కడుపు మంటతోనే చంద్రబాబు పండగ సంప్రదాయాన్ని వదిలి విషం చిమ్ముతున్నారన్నారు. పండుగ పూట ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాల్సిన మనిషి శాపనార్థాలు పెట్టడం మంచిది కాదని హితవు పలికారు.

tags : botsa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info