మాజీ మంత్రి,టిడిపి నేత భూమా అఖిలప్రియ ఒక సినిమాలో జరిగిన సన్నివేశాలను చూసి అదే ప్రకారం కిడ్నాప్ ప్లాన్ చేశారన్న వార్త వచ్చింది.పోలీసుల విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని అంటున్నారు.అఖిలప్రియ భర్త భార్గవ్ సోదరుడు చంద్రహాస్ ఈ
సినిమా క్యాసెట్ తీసుకు వచ్చారట. కిడ్నాప్‌కు ముందు అక్షయ్ కుమార్ నటించిన ‘స్పెషల్ 26’ అనే సినిమాని అఖిలప్రియ అండ్ గ్యాంగ్‌కు ఆయన చూపెట్టాడు. అలానే ఐటి అధికారులుగా ఎలా నటించాలి అనే దానిపై వారం రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిసింది. యూసుఫ్ గూడలోని ఎంజీఎం స్కూల్లో చంద్రహాస్, అఖిలప్రియ అండ్ గ్యాంగ్‌కి కిడ్నాప్‌కు సంబంధించి శిక్షణ ఇచ్చాడు. అఖిలప్రియ ఆదేశాలకు అనుగుణంగానే అక్షయ్ కుమార్ సినిమా చూపెట్టి కిడ్నాప్ చేయించినట్లు చెబుతున్నారు. అలానే ఐటి అధికారుల చెకింగ్ డ్రెస్సులు, ఐడి కార్లను చంద్రహాస్ తయారు చేశాడు. శ్రీ నగర్ కాలనీలోని ఒక సినిమా కంపెనీ నుంచి ఐటి అధికారుల డ్రెస్‌లను వీరు అద్దెకు తీసుకున్నారట. tags : akhilapriya