మబ్బును చూసి ముంతలోని నీటిని పారబోసినట్లుగా ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరు ఉన్నట్లుగా ఉంది. ఆయన హిందువుల ఓట్లను ఎంతవరకు పొందుతారో కాని, ఆయన క్రైస్తవ సమాజాన్ని బాగా దూరం చేసుకున్నట్లు కనిపిస్తుంది.మత సామరస్యాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ ఆ పార్టీ క్రిస్టియన్ సెల్ నేతలు పలువురు రాజీనామాలు చేయడం విశేషం. క్రైస్తవులను అవమానిస్తూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయటానికి నిరసనగా 13 జిల్లాల టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఆ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. టీడీపీ క్రిస్టియన్ సెల్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు యలమంచిలి ప్రవీణ్ నేతృత్వంలో మంగళవారం విజయవాడలో సమావేశమైన 13 జిల్లాల నాయకులు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. పాస్టర్లకి రూ.5 వేలు ఎవరు ఇమ్మన్నారని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారని, అదే విషయాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాన్ని మరిచారా? అని చిత్తూరు జిల్లా క్రిస్టియన్ సెల్ అద్యక్షుడు ప్రవీణ్ ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లలో క్రిస్మస్ వేడుకలు ఎలా జరుపుతారని ప్రశ్నించిన చంద్రబాబు గతంలో చర్చికి వచ్చి గంటన్నర ఎలా ప్రార్థన చేశారు? బైబిల్ ఎలా చదివారు? అని నిలదీశారు. tags : chandrababu, church