ప్రజా సంక్షేమమే జగన్ లక్ష్యం అని , ఆయనకు దేవుడిపై అచంచల విశ్వాసం ఉందని ప్రభుత్వ సలమాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. మతం వ్యక్తిగతం.. రాజకీయం ప్రజా సంక్షేమాన్ని కోరేదై ఉండాలన్న మా నేత మార్గదర్శకత్వంలో పార్టీ ముందుకెళ్తోంది. మతాలను రాజకీయాల్లోకి తీసుకురావద్దు. ఈ దిశగా కుయుక్తులకు దిగే శక్తులను ఉపేక్షించబోం. 2024 ఎన్నికల నాటికి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తేవాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. వచ్చే నాలుగైదు నెలల్లో పరిపాలనను విశాఖకు తరలించే వీలుంది. అధికార వికేంద్రీకరణలో భాగంగా విశాఖ పాలన రాజధాని అనే నిర్ణయం ఎప్పుడో జరిగింది. కోర్టు కేసుల వల్లే ఆలస్యమవుతోంది. ఎన్నికల సంఘం ఉద్యోగులు కొందరిని నిమ్మగడ్డ తొలగించడం సమంజసం కాదు"అని సజ్జల పేర్కొన్నారు. tags : sajjala