A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాడు సిబిఐ జెడి-నేడు నిమ్మగడ్డ
Share |
January 24 2021, 9:34 pm

నిమ్మగడ్డను అడ్డుపెట్టుకుని అమ్మ ఒడిపై కుట్ర జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో సిబిఐ జెడి లక్ష్మీనారాయణను అడ్డుపెట్టుకుని కొన్ని పార్టీలు రాజకీం చేశాయని, ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం రెండో ఏడాది అమ్మ ఒడి అమలు చేస్తున్న తరుణంలో.. దేవాలయాలపై దాడులు ఆగిపోయాయి. ‘నిమ్మగడ్డ’ను అడ్డం పెట్టుకుని కొత్త ఎపిసోడ్‌ను తెరమీదకు తెచ్చారు. గతంలో జేడీ లక్ష్మీనారాయణ మాదిరి ఇప్పుడు ఎల్లో మీడియా నిమ్మగడ్డను నెత్తికెత్తుకుంది. సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం దక్కకుండా చేయడమే వీరి లక్ష్యం. నిమ్మగడ్డ రమేష్‌ ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ఇవ్వడం దురుద్దేశపూరితమే. మా ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధపడితే... మండల ఎన్నికలు రద్దు చేయడం, తిరిగి మధ్యలో ఎక్కడ ఆగాయో అక్కడి నుంచి కాకుండా.. పంచాయతీ ఎన్నికలకు కొత్తగా తేదీలు ప్రకటించడం ఎవరి ప్రయోజనం కోసం? కోవిడ్‌ వ్యాక్సిన్‌కు యావత్‌ దేశంతో పాటు రాష్ట్రం సన్నద్ధమవుతుంటే, ఉద్యోగులూ భయంతో ఎన్నికలు వద్దంటుంటే నిమ్మగడ్డకు ఎందుకీ పంతం? బాబు కోసం రాజ్యాంగ పదవిని దిగజార్చాలా?అని ఆయన ప్రశ్నించారు.

tags : sajjala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info