ఎపి ప్రతిపక్ష నేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగీ పండుగ రోజు కూడా తన అబద్దాలు మానకపోవడం, ముఖ్యమంత్రి జగన్ పై ఏది పడితే అది మాట్లాడడం అత్యంత దురదృష్టం. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ది చేసేశారట. అదే తన తప్పు అయితే క్షమించాలని చంద్రబాబు అన్నారని టిడిపి మీడియాలో కధనం వచ్చింది. ప్రజలపై జగన్ డెబ్బైవేల రూపాయల చొప్పున భారం వేశారని ఆయన ఆరోపించారు. జగన్ నాటకాలు నమ్మి ప్రజలు పూనకం వచ్చినట్లు ఆ పార్టీకి ఓటు వేశారని చంద్రబాబు వాపోయారు.తానేమి తప్పు చేశానో తెలియదని, రాష్ట్ర అభివృద్దికి కృషి చేశానని, అదే తన తప్పు అయితే క్షమించాలని ఆయన అన్నారు.ప్రభుత్వం అమరావతి, పోలవరం లను పోడిచేసిందని ఆయన ఆరోపించారు.రాష్ట్రంలో మెగా దోపిడీ జరుగుతోందని, జగన్ పేదల రక్తం తాగుతున్నారని ఆయన అన్నారు.వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు పెడుతున్నారని, వాటిని మంత్రులకు పెట్టాలని ఆయన అన్నారు.
.................
పేదలకు ఒక్కొక్కరికి డెబ్బై,ఎనభైవేల రూపాయల చొప్పున జగన్ పంపిణీ చేశారని, లక్షల రూపాయల విలువైన ఇళ్ల స్థలం ఇచ్చారని వైసిపి చెబుతుంటే చంద్రబాబు భిన్నంగా మాట్లాడుతున్నారు.తాను ఏమి తప్పు చేశానో తెలియదని అనడం మరింత విస్తుకొలిపే అంశం అవుతుంది. tags : chandrababu