రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆశించిన ఫలితాన్ని పొందలేకపోయారు. ఎన్నికల షెడ్యూల్ ను నిలుపుదల చేస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ తక్షణ ఉత్తర్వులు ఇవ్వలేదు. అత్యవసరంగా దీనిని విచారించవలసిన అవసరం ఉందా అన్న అంశాన్ని కోర్టు పరిశీలించింది. తదుపరి ఈ నెల 18 కి కోర్టు విచారణను వాయిదా వేసింది. ఇది అత్యవసర పిటిషన్ అని నిమ్మగడ్డ తరపు న్యాయవాది వాదించినా డివిజన్ బెంచ్ అంగీకరించలేదు.అయితే పద్దెనిమిదిన కొత్త బెంచ్ ఏర్పడుతుందని, మళ్లీ విచారణ మొదటికి వస్తుందని భావిస్తున్నారు.ఓటర్ల జాబితా తదితర అంశాలపై ప్రభుత్వ న్యాయవాదులు తమ వాదన చేశారు. వాక్సిన్ పంపిణీ, ప్రజల ఆరోగ్యం ముఖ్యమైనదని ప్రభుత్వం భావిస్తోందని వారు వివరించారు. tags : nimmagadda