ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారని అనుకోవాలి. స్థానిక ఎన్నికలకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోందని , తద్వారా గ్రామస్వరాజ్యానికి
విఘాతం కలిగిస్తోందని ఆయన అన్నారని వార్త వచ్చింది. టిడిపి నేతల వీడియో కాన్పరెన్స్ లో ఆయన మాట్లాడారు.స్థానిక ఎన్నికలు పెట్టవద్దని మార్చిలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కరోనా సంక్షోభంలో ఎన్నికలు పెట్టాలని ,ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు మద్దతుగా మాట్లాడుతున్నారు.స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికలో వైసిపిని ఓడించడమే లక్ష్యంగా పని చేయాలని ఆయన సూచించారు. 2018లో ఎన్నికలు పెట్టవలిసన చంద్రబాబు నాయుడు , పెట్టకపోగా, ఇప్పుడు కరోనా సంక్షోభంలో ఎన్నాకలు పెట్టాలని అనడం సంచలనమే కదా! tags : chandrababu