తెలుగు యువతకు కొత్త అద్యక్షుడిని నియమించారు. గంగుపల్లి శ్రీరామ్ అనే యువకుడిని పార్టీ నాయకత్వం నియమించిందన్న వార్త వచ్చింది. శ్రీరామ్ చిత్తూరు జిల్లాకు చెందిన బీసీ నేత. ఆయన గతంలో మదనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. చేనేత వర్గానికి చెందిన ఆయన కొంతకాలం జాతీయ చేనేత బోర్డు సభ్యుడిగా ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆయా పదవులను భర్తీ చేయడం ద్వారా పార్టీకి మళ్లీ ప్రజలలో ఆదరణ తేవడానికి కృషిచేస్తున్న నేపధ్యంలో ఈ నియామకం జరిగిందని భావిస్తున్నారు. tags : youth