A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్నికల కమిషనర్ వాదనే ఉపయోగపడిందా!
Share |
May 15 2021, 5:06 am

గత ఏడాది మార్చి నెలలో స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేస్ కుమార్ చేసిన వాదనను ప్రభుత్వ ఆడ్వకేట్ జనరల్ ఈసారి తన వాదనలో పూర్తిగా వాడుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
‘అప్పుడు ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నికలను వాయిదా వేశామని చెప్పిన ఎన్నికల కమిషనర్, ఇప్పుడు అదే ప్రజల ప్రాణాలను, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ ఎన్నికలు నిర్వహిస్తానంటున్నారు.. కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉందని, కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు కేంద్రం సర్వం సిద్ధం చేస్తోందని చెప్పినా పట్టించుకోలేదు. వ్యాక్సినేషన్‌ సమయంలో స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం అయ్యే పరిస్థితి లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాం. హైకోర్టు ఇరుపక్షాలు కూర్చొని సంప్రదింపులు జరపాలని ఆదేశించింది. అలా సంప్రదింపులు జరిపిన కొద్ది గంటల్లోనే ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషనర్‌ విడుదల చేశారు. దీనిని బట్టి ఎన్నికల కమిషనర్‌ ముందుస్తుగానే నిర్ణయం తీసుకున్నారని సులభంగా అర్థమవుతోంది..’ అని వివరించారు.

‘కరోనా వ్యాక్సినేషన్‌ ఓ బృహత్కార్యం. రాష్ట్రంలో 1.49 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభం కానుంది. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడాల్సిన రాజ్యాంగ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల కంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యం. ఇన్ని వివరాలను సమర్పించినా కూడా ఎన్నికల కమిషన్‌ ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల చేసింది. కేరళ, తెలంగాణ, రాజస్తాన్‌ తదితర చోట్ల పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన తర్వాతనే కోవిడ్‌ కేసులు భారీగా పెరిగాయి. ఇది దృష్టిలో పెట్టుకునే ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశాం. వ్యాక్సినేషన్‌ తర్వాత కరోనా భయం లేకుండా నిర్భయంగా ఓటు వేసే పరిస్థితులు ఉన్నాయన్న విశ్వాసాన్ని ప్రజల్లో తీసుకురావాలి. అప్పటివరకు వేచి చూడాలి. ఎన్నికల కమిషనర్‌ తన సంకుచిత మనస్తత్వంతో ప్రజారోగ్యాన్ని, ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టాలని చూస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ఎన్నికల షెడ్యూల్‌ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి.’ అని శ్రీరామ్‌ కోర్టును అభ్యర్థించారు.

tags : ap highcourt, nimmagadda

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info