స్థానిక ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు. ‘ఓసారి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత సాధారణంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చింది. అది ఇప్పటికీ అమలవుతూనే ఉంది. ఎన్నికల నియమావళి ఇప్పటికే అమల్లోకి వచ్చింది. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రభుత్వం ఏవేవో కారణాలు చెబుతోంది...’ అని అన్నారు. tags : ap, highcourt