A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎద్దుల మధ్య పోరాటం-లేగదూడలు బలికారాదు
Share |
May 15 2021, 3:14 am

ఎపి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఎన్నికల ప్రకటనను నిలుపుదల చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి గంగారాం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎద్దుల పోరాటంలో లేగదూడలు బలికాకూడదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎన్‌.హరినాథ్‌ వాదనలు వినిపించారు. కేంద్రానికి కూడా ప్రజల ప్రాణాలే ముఖ్యమన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో.. దేశంలోని 135 కోట్ల మందికి దశల వారీగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్‌ బయటకు వస్తుంది. ఇందుకు సంబంధించి కేంద్రం ఇచ్చే ఆదేశాలను రాష్ట్రాలు అమలు చేసి తీరాల్సిందే.’ అని వివరించారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎద్దుల మధ్య జరిగే పోరాటంలో లేగదూడలు బలి కాకూడదని, వాటిని మనం కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన షెడ్యూల్‌ అమలును నిలిపేస్తున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

tags : ap, highcourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info