A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో విద్యార్ధులకు లాప్ టాప్ లు
Share |
January 24 2021, 10:10 pm

అమ్మఒడి పథకానికి టెక్నాలజీని సీఎం జగన్ అనుసంధానం చేశారు. విద్యార్ధులకు కంప్యూటర్ స్కిల్స్‌ పెంచేందుకు ల్యాప్‌టాప్ ఆఫర్ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి 9 నుంచి 12వ తరగతి విద్యార్ధులకు ఈ ఆఫర్‌ ప్రకటించారు. అమ్మఒడి డబ్బు వద్దనుకుంటే ల్యాప్‌టాప్‌ ఇస్తామని సీఎం వైఎస్ జగన్‌ తెలిపారు. 4 జీబీ ర్యామ్‌, 500 జీబీ హార్డ్‌డిస్క్‌, విండోస్ 10 ఓఎస్‌ ఫీచర్స్‌తో ల్యాప్‌టాప్‌ ఉంటుందన్నారు. మూడేళ్ల వారంటీతో కూడిన ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు అందిస్తాం. రాబోయే మూడేళ్లలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సేవలు అందిచడంతో పాటు అండర్ గ్రౌండ్‌ ఇంటర్నెట్ కేబుల్‌ను ఏర్పాటు చేస్తాం. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నాం. వైఎస్‌ఆర్ పీపీ-1, పీపీ-2, ప్రీ ఫస్ట్ క్లాస్‌గా కొనసాగుతాయని’’ సీఎం తెలిపారు.

tags : jagan, laptaps

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info