A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అఖిలప్రియకు బెయిల్ నిరాకరణ
Share |
January 20 2021, 11:14 am

కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, టిడిపి నేత భూమా అఖిలప్రియ కు బెయిల్ లభించలేదు.ఆమె వేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. తన ఆరోగ్యం బాగాలేదని, బెయిల్‌ ఇవ్వాలని పిటిషన్‌లో ఆమె కోరారు. అయితే వైద్యులు న్యాయస్థానానికి సమర్పించిన వైద్యపరీక్షల్లో ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు తేలింది. దీంతో బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కోట్టివేసింది. కిడ్నాపు కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలిని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. అఖిలప్రియ బయటకొస్తే సాక్షులను బెదిరించవచ్చని పోలీసులు తమ పిటిషన్లో తెలిపారు. అఖిల ప్రియను మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది. నేటి నుంచి అఖిల ప్రియ 13వ తేదీ వరకు పోలీస్‌ కస్టడీలో ఉండనున్నారు.

tags : akhilapriya

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info