రాజ్యాంగ పదవులలో ఉన్నవారు తమను ఎవరు కలుస్తున్నారన్నదానిపై కూడా జాగ్రత్తలు పాటించాలి.లేకుంటే ఇలాగే జరుగుతుంది. ఎపి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్
కృష్ణా జిల్లా మొవ్వ మండల కేంద్రానికి ఆదివారం దైవ దర్శనానికి వెళ్లిన ఆయనకు అక్కడి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారన్న వార్త వచ్చింది. గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలోనే శాలువా కప్పి సన్మానించారు. టీడీపీ అనుబంధ విభాగం తెలుగు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తాతినేని పూర్ణచంద్రరావు, ఆ పార్టీ మొవ్వ గ్రామ కమిటీ అధ్యక్షుడు బుజ్జి కోటేశ్వరరావు, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ సభ్యులుగా పనిచేసిన శీలం బాబురావు, ఇతర నాయకులు పోతర్లంక సుబ్రహ్మణ్యం, మండవ వీరభద్రరావు, మండవ రవికిరణ్, మండవ రాజ్యలక్ష్మి తదితరులు నిమ్మగడ్డతో ఆత్మీయంగా మెలుగుతూ కొద్దిసేపు ముచ్చటించారు. నిమ్మగడ్డ మొవ్వ గ్రామానికి వెళ్లుతున్న విషయాన్ని టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పార్టీ పెద్దలు గ్రామ పార్టీ నేతలకు ముందే సమాచారం ఇచ్చారని తెలిసింది. అందువల్లే అక్కడి నేతలు శాలువాతో ముందే సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. అంతకు ముందు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మోపిదేవి సుబ్రమణ్యస్వామి ఆలయంలో, పేదకల్లేపల్లి దుర్గానాగేశ్వరస్వామి ఆలయంలో, శ్రీకాకుళం గ్రామంలోని శ్రీకాకులేశ్వరస్వామి ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. tags : nimmagadda