పేద విద్యార్దులకు ఉపయోగపడే అమ్మ ఒడి పధకాన్ని అడ్డుకోవడానికి కుట్రలు జరుగుతున్నాయని ఎపి మంత్రులు ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌లు మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చంద్రబాబు చేతిలో కీలు»ొమ్మగా మారారని, సంక్షేమ పథకాలను నిలిపి వేసి రాక్షసానందం పొందాలని చూస్తున్నారని ద్వజమెత్తారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి న్యాయ వ్యవస్థను కూడా పరిగణనలోకి తీసుకోక పోవడం సిగ్గు చేటన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమ్మ ఒడి కార్యక్రమాన్ని నెల్లూరులో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ‘జగనన్న అమ్మ ఒడి’ రెండో విడత కార్యక్రమం ప్రారంభించనున్న నేపథ్యంలో నెల్లూరులో మంత్రులు విలేకరులతో మాట్లాడారు. tags : ap, ammavodi