A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉత్తంకుమార్ రెడ్డి ఆవేదన
Share |
January 20 2021, 11:41 am

తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్.పిలు, ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ ప్రభుత్వం అవమానిస్తోందని పిసిసి అద్యక్షుడు,నల్గొండ ఎమ్.పి ఉత్తంకుమార్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ అధికారుల వైఖరిపై లోక్‌సభ స్పీకర్‌కు, సభాహక్కుల కమిటీకి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణానదిపై ఇటీవల ప్రారంభమైన వంతెనను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ 2013లో రూ.50 కోట్లతో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయించానని తెలిపారు. అయితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం అప్రోచ్‌రోడ్డు పనులు మాత్రమే చేసి కనీస ఆహ్వానం కూడా లేకుండా తనను అవమానపరచిందన్నారు.


అదే విధంగా పార్లమెంట్‌ సభ్యులకు కొన్ని హక్కులు, ప్రొటోకాల్‌ మర్యాదలు ఉంటాయని, కానీ ఉన్నతాధికారులు వాటిని పాటించకుండా కేవలం ఏఈ, డీఈ స్థాయి అధికారులతో నామమాత్రపు సమాచారమిచ్చి శిలాఫలకం కిందిభాగంలో పేరు పెట్టారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

tags : uttamkumarreddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info