A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పదవులు ఇప్పిస్తామంటే కోట్లు ఖర్చు చేస్తారా
Share |
January 24 2021, 8:26 pm

పదవులు వస్తాయంటే కోట్లు ఖర్చు చేయడానికి వెనుకాడని రోజులు ఇవి అనుకోవాలి. కర్నాటకలో ఒక వ్యక్తి ఆర్టిసి చైర్ పర్సన్ పదవి ఇప్పిస్తానని, అలాగే మరొకరికి గవర్నర్ పదవి ఇప్తిస్తామని చెప్పి కోట్లు వసూలు చేశాడు.అతనికి ప్రముఖులతో ఉన్న పరిచయాలే పెట్టుబడి అల.బెంగుళూరలో ఇతనిని పట్టుకున్నారు. యువరాజ్‌ అలియాస్‌ సేవాలాల్‌ ఇంతకుముందే చీటింగ్‌ కేసుల్లో ఇతడు ఇరుక్కోగా బడా నాయకులు విడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ పార్టీ ముఖ్య నేతలతో తీయించుకున్న ఫోటోలను అడ్డం పెట్టుకుని దందా సాగించేవాడు. బెంగళూరుకు చెందిన ఒక పారిశ్రామికవేత్తకు కేఎస్‌ ఆర్టీసీ అధ్యక్ష పదవిని ఇప్పిస్తానంటూ నమ్మించి కోటి రూపాయలను వసూలు చేశాడు. ఎన్నిరోజులైన పదవీ లేదు, డబ్బులు వాపస్‌ ఇవ్వకుపోవటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తన దందాలో విశ్రాంత ఎస్పీ పాపయ్యను మధ్యవర్తిగా ఉపయోగించుకున్నట్లు తెలిసింది. ఒక ఉన్నత పదవిలో ఉన్న మహిళకు గవర్నర్‌ పదవిని చేతిలో పెడతానని కోట్లాది రూపాయలను వసూలు చేసినట్లు ప్రచారం. పదవి రాకపోవడంతో ఆ మహిళ విల్సన్‌ గార్డెన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇం

tags : karnataka

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info