రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్ ను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా నిర్ణయం చేసిందని,తమ అభిప్రాయాలను పరిగననలోకి తీసుకోలేదని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తెచ్చింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలను నిలుపుదల చేసింది.ఆడ్వకేజ్ జనరల్ శ్రీరామ్ రెండు గంటలపాటు తన వాదన వినిపించారు.ప్రధానమంత్రి వీడియో కాన్పరెన్స్ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పినా ఎన్నికల కమిషనర్ మాత్రం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు. ఈ విషయాలను విన్న హైకోర్టు స్థానిక ఎన్నికల షెడ్యూల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ఇటీవలికాలంలో ఎపి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన ప్రధాన నిర్ణయం అని చెప్పవచ్చు. తన ఇష్టం వచ్చినట్లు చేయాలని నిమ్మగడ్డ కు ఎదురుదెబ్బ తగిలింది. tags : ap highcourt