నెల్లూరులో జరిగిన సబలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ,ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రాభివృద్ధిని చూసి ప్రతిపక్షాల్లో కడుపుమంట కనిపిస్తోందని ఆయన అన్నారు. దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని, ఆ తర్వాత దేవాలయాల సందర్శన అంటున్నారని మండిపడ్డారు. రథాలను తగలబెట్టి రథయాత్రలు చేస్తున్నారు.. సంక్షేమ పథకాల మంచి ప్రజలకు తెలియకూడదనే.. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని సీఎం జగన్ ధ్వజమెత్తారు.
‘‘దేవుడిపై భక్తి లేనివారు, ఆలయాల భూములను కాజేసిన వారు.. ఆలయాల్లో క్షుద్రపూజలు చేసినవారు. ఇప్పుడు దేవుడిపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నారు. కోవిడ్‌కు భయపడి చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్‌లో దాక్కుంటారు. సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండా ఎన్నికలు నిర్వహించాలంటారు.. పేదింటి మహిళలకు ఇళ్ల స్థలాలు అందకుండా కేసులు వేస్తున్నారు. వ్యవస్థలో ఉన్న కోవర్టులు కూడా ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. ఆలయాల్లో విగ్రహాలు పగలగొట్టారు.. రాబోయే రోజుల్లో బడులపై విధ్వంసం చేస్తారేమో. విద్రోహ శక్తుల పట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలని’’ సీఎం జగన్ తెలిపారు. tags : jagan