ప్రముఖ పాత్రికేయుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత తుర్లపాటి కుటుంబరావు కన్నుమూశారు. ఆయన వయసు ఎనభై ఏడేళ్లు. జర్నలిస్టుగానే కాకుండా మంచి వక్తగా కూడా ఆయన రాణించారు. ఆరువేల మందికి సంబందించిన జీవితచరిత్రలను వార్తలలో వ్యక్తి పేరుతో రచించారు. అలాగే 18 మంది ముఖ్యమంత్రులతో తన అనుబందాన్ని వివరించే పుస్తకాన్ని ఆయన రచించారు. ఇలా పలు పుస్తకాలను రచించిన ఈయనకు 2002లో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆయన గతంలో పలు స్కూళ్లలో వార్సికోత్సవాలకు, పలు సభలకు ముఖ్య అతిధిగా వెళుతుండేవారు. ఆయన ఉపన్యాస కేసరిగా కూడా ప్రసిద్ది గాంచారు. తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వద్ద కార్యదర్శిగా పనిచేశారు. ఆంద్రజ్యోతి దినపత్రికకు ఎక్కువ కాలం సేవలు అందించారు.ఆయన కు కుమారుడికి జవహరల్ లాల్ నెహ్రూ అని పేరు పెట్టుకున్నారు. ఆయనకు కుమార్తె కూడా ఉన్నారు.గత అర్ధరాత్రి ఆయనకు గుండె పోటు రావడంతో కన్నుమూశారు. tags : turlapati