A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇంత పెద్ద వార్తను మీడియా ఎందుకు ఇవ్వలేదో!
Share |
January 20 2021, 11:50 am

బ్యాంకును మోసం చేసిన మరో ప్రముఖ సంస్థ గురించి రెండు ఆంగ్ల దినపత్రికలు తప్ప మిగిలిన మీడియా ఎందుకు వార్త ఇవ్వలేదో తెలియదు. కోస్టల్ ప్రాజెక్టు సంస్థ బ్యాంక్ కు 4736 కోట్ల మేర మోసం చేసిందని సిబిఐకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేసిందని రెండు ఆంగ్ల పత్రికలలో పెద్ద కధనం వచ్చింది.అక్కౌంట్ పుస్తకాలలో సరైన గణాంకాలు ఇవ్వకుండా మోసం చేశారని, ఇతరత్రా మరికొన్ని అభియోగాలను ఆ కంపెనీపై మోపారు. సిబిఐ ఈ కంపెనీ డైరెక్టర్ ల ఇళ్లు, ఆఫీస్ లలో సోదాలు జరిపింది. ఈ కంపెనీ యజమాని సురేంద్ర్ర ఒక ప్రముఖ టిడిపి నేత, మాజీ ఎమ్.పికి, ఒక ప్రముఖ టీవీ చానల్ యజమానికి వియ్యంకుడు అవుతారు. మొత్తం మీద సంచలనాత్మకమైన 4736 మోసం కేసును మెజార్టీ మీడియా కావాలని ఇవ్వలేదా?లేక వారు మిస్ అయ్యారా?అన్నది తెలియదు.

tags : costal, media

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info