గత ప్రభుత్వం హయాంలో చక్రం తిప్పిన ఎబి వెంకటేశ్వరరావుకు మద్దతు ఇవ్వడానికి ఎపి ఐపిఎస్ అధికారుల సంఘం నిరాకరించిందన్న వార్త ఆసక్తికరంగా ఉంది. ఎబి వెంకటేశ్వరరావు రాసిన లేఖపై సంఘం చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.డ్రోన్ లో కుంభకోణం కేసులో ఆయన సస్పెండ్ అయ్యారు. అయితే ప్రభుత్వం వేధిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు.
ఏబీ వెంకటేశ్వరరావు లేఖపై ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా చర్చించింది. ఆయనపై ప్రభుత్వం సస్పెన్సన్ విధించడం సరైనదే అని అసోసియేషన్ అభిప్రాయపడింది. ప్రస్తుతం ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, విచారణను ఎదుర్కొక తప్పదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఎలాంటి జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. కొన్ని ఛానళ్లలో తాము ఏబీకి మద్దతు తెలిపామని వస్తున్న వార్తలు అవాస్తవమని ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తోసిపుచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావుకు ఎలాంటి మద్దతు తెలపలేదని పేర్కొంది. అలాగే ఐపీఎస్ అధికారులపై ఎలాంటి ఆరోపణలు చేయకూడదని.. ఏబీ వెంకటేశ్వరరావును హెచ్చరిచ్చింది. tags : ab