అమ్మ ఒడి కార్యక్రమాన్ని ఎపి ప్రభుత్వం యధాతదంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ చెప్పారు.ఈ నెల పదకుండున ఈ కార్యక్రమం జరగవలసి ఉంది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి శుక్రవారమే జీఓ–3ను విడుదల చేశామని ఆయన తెలిపారు. ఈ పథకం అమలుచేస్తున్న సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం, కోడ్ పేరిట ఈ పథకం అమలును నిలిపివేయాలని చూడడం దురదృష్టకరమన్నారు. నెల్లూరులో సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి నిధులు నేరుగా జమ అవుతాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 1,76,589 మంది తల్లులు కొత్తగా లబ్ధిపొందనున్నారని మంత్రి సురేష్ చెప్పారు. పోయిన ఏడాది 42,24,302 మందికి ఇవ్వగా ఈ ఏడాది 44,00,891మందికి అమ్మఒడి అమలవుతోందన్నారు. అమ్మఒడి పథకం అమలు చేయనున్న తరుణంలో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడం దారుణమని మంత్రి వ్యాఖ్యానించారు. tags : adimulam