తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద ఉన్న దివీస్ కంపెనీకి వ్యతిరేకంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిరసన చెప్పిన తీరుపై ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశేట్టి రాజా మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఐదేళ్లు పార్టనర్‌గా ఉన్నప్పుడే దివీస్ పరిశ్రమకు 560 ఎకరాలు కేటాయించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు పవన్ చెబుతున్న సిద్ధాంతాలన్నీ అప్పుడేమయ్యాయని దాడిశెట్టి రాజా ప్రశ్నించారు.
దివీస్‌కు భూములు కట్టబెట్టిందే కాకుండా అన్ని అనుమతులనూ నాటి టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దివీస్‌కు వ్యతిరేకంగా గతంలో జరిగిన పోరాటానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. డబుల్ స్టాండ్ తీసుకునేది పవనేనని విమర్శించారు. సీఎం జగన్ ప్రజల పక్షాన పని చేస్తున్నారన్నారు. ప్రజలకు, రైతులకు, యువతకు నష్టం కలిగే పనులు చేయరని చెప్పారు. tags : dadisetti raja