టిడిపి పక్షాన గతంలో నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే అయిన ఫిలిప్ సి తోచర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడుకు రాజీనామా పత్రాన్ని పంపారు.క్రైస్తవులను అవమానించే రీతిలో చంద్రబాబు మాట్లాడిన తీరు , ఆ పార్టీ వైఖరి అసహ్యం పుట్టిస్తుందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మెడలో శిలువ వేసుకుని బైబిల్ చదువుతూ నా జన్మధన్యమైందని ప్రకటించుకున్నారని ఆయన అన్నారు. రామతీర్థం, ఇతర దేవాలయాల్లో జరిగిన ఘటనలకు క్రైస్తవానికి ఎటువంటి సంబంధం లేకపోయినా.. రాజకీయాల కోసం క్రైస్తవులను అవమానిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులంతా చంద్రబాబు పార్టీలో ఎలా కొనసాగుతున్నారంటూ తమపై ఒత్తిడి చేస్తున్నారన్నారు., ఫిలిప్ సి తోచర్ 2014–19 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఆంగ్లో ఇండియన్ కోటాలో నామినేటెడ్ సభ్యుడిగా ఉన్నారు. tags : resign