ఎపిలో కొత్తగా ఇరవైఆరు జిల్లాలు ఏర్్పాటు చేయాలని అధికారుల కమిటీ ప్రతిపాదించింది. అదే సమయంలో తొమ్మిది కొత్త రెవెన్యూ డివిజన్ లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మూడు డివిజన్ లను రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు. పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే.అయితే అరకు నియోజకవర్గం నాలుగు జిల్లాలలో విస్తరించి ఉన్నందున దానిని రెండు జిల్లాలుగా చేయాలని సూచించారు.పార్వతీపురం కేంద్రంగా ఒక జిల్లా, పాడేరు కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు చేయాలని సిఫారస్ చేశారు. కొత్త డివిజన్ లలో బొబ్బిలి ,భీమిలి, భీమవరం లేదా తణుకు,నందిగామ, చీరాల,బాపట్ల,ఆత్మకూరు, రాయచోటి, పలమనేరులను డివిజన్ కేంద్రాలుగా చేయాలని సూచించారు. tags : ap, new distritcs