ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సహా శాసనసభలో ఉన్న వైసిపి ఎమ్మెల్యేలంతా పకపకా నవ్విన ఘట్టం ఆసక్తికరంగా ఉంది. పోలవరం అంశంపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గతంలో చంద్రబాబు టైమ్ లో జరిగిన పలు విషయాలను వివరించారు. పునరావాల స్యాకేఉజీ లేకుండా కేంద్రం ప్రతిపాదించిన ఇరిగేషన్ బాగానికి మాత్రమే ఒప్పందం అవడం తదితర విషయాలను ఆయన లేఖల ప్రదర్శనతో సహా అసెంబ్లీలో తెలియచేశారు. ఆ సందర్భంలో తాము అనవసర వ్యయం చేయడం లేదని అంటూ గత చంద్రబాబు ప్రభుత్వ టైమ్ లో పూర్తికాని పోలవరం ప్రాజెక్టు సందర్శన పేరుతో జనాన్ని తరలించి ఎనభై మూడు కోట్లు వ్యయం చేశారని అన్నారు. ఆ సందర్భంగా ఒక వీడియోని ఆయన చూపించారు.అందులో కొందరు పచ్చ చీరలు కట్టుకున్న మహిళలు జయము జయము చంద్రన్నా,నీకెవరూ సాటిరారయో అంటూ ,పోలవరం కట్టేసినట్లు భజన రూపంలో పాడుతుంటారు. ఆ వీడియో చూస్తూ జగన్ తో సహా అందరూ ఒకటే నవ్వులు నవ్వారు. ఆ సమయంలో టిడిపి ఎమ్మెల్యేలు ఎవరూ సభలో లేరు. tags : jagan, laugh